“Nee Pilupe Naa Dari Chere” is a devotional Telugu Christian song by Joshua Shaik Ministries, composed by Pranam Kamlakhar. The song is an inspiring call to follow God’s guidance and wisdom in every step of life’s journey.
Nee Pilupe Naa Dari Chere Song Telugu Lyrics
నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా
నీ మనసే నా మది కోరే – ఎనలేని సంబంధమా
కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా
కోరుకున్నాను నీ ప్రేమనే – దాచుకున్నాను నీ వాక్యమే
ఎన్ని కాలాలు నే దాటినా – కడలి కెరటాలు నను తాకినా
ఆలకించావు నా ప్రార్ధన – ఆదరించావు నా యేసయ్య
నీ మాటే నాలో మెదిలే – దినమెల్ల నీ ధ్యానమే
అణువణువు నాలో పలికే – నీ స్తోత్ర సంకీర్తన
కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా
నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా
చేరుకున్నాను నీ పాదమే – వేడుకున్నాను నీ స్వాంతనే
జీవ గమనాల సంఘర్షణ – అంతరంగాన ఆవేదన
తెల్లవారేను నీ నీడన – పొందుకున్నాను నీ దీవెన
నీ పిలుపే నా దరి చేరే – నీతోటి నా స్నేహమా
నీ మనసే నా మది కోరే – ఎనలేని సంబంధమా
కోటి రాగాలు నే పాడుతున్నా – తీరనేలేదు నా దాహమైన
నిన్ను చేరేటి సంతోషమా
The lyrics of “Nee Pilupe Naa Dari Chere” highlight the importance of responding to God’s call and relying on His direction to navigate through life. The song emphasizes the necessity of God’s presence and His words as a guiding light and source of knowledge. It speaks of the peace and fulfillment that come from walking in God’s path and being enveloped in His love and grace. The melody and the heartfelt rendition by the artists create a worshipful atmosphere, encouraging believers to seek God’s guidance and stay faithful to His calling. This song, with its deep spiritual message, resonates with many, reminding them of the divine support and wisdom available to them.