అమర లోకనాథుడా అంతమే లేనివాడ
సర్వలోకనాథుడా ఆది మద్యాంత రహితుడా (×2)
సకల జనులకు ఆరాధ్యుడవు
సృజన శీలుడ శుభకరుడా (×2)
నీవే నా సర్వము నీవే నా జీవము
నీవే నా ఆరాధన యేసయ్య (×2)
చరణం 1
శూన్యములో భూమిని వ్రేలాడదీసితివి
అగాధ జలములను రాసిగా పోసితివి (×2)
నిన్నశ్రయించిన నీ జనులకు అద్భుతాలే చేసితివి
అసాధ్యమైన వాటిని సాధ్యము చేసితివి
(నీవే)
చరణం 2
సర్వలోకమును సృష్టించిన వాడవు
మానవజాతికి నిర్మాణ కర్తవు (×2)
మనుషులపై ప్రేమతో సిలువ త్యాగమే చేసితివి
విశ్వసించిన వారికి రక్షణ నిచ్చితివి
(నీవే)
చరణం 3
ప్రళయ జలములపై ఆసీనుడా యేసయ్య
నిత్యము రారాజుగా మా మధ్య నిలచితివి (×2)
నిను వెంబడించిన నీవారికి మోక్షమార్గమే చూపితివి
సుఖ సౌఖ్యాలతో ఆశీర్వదించితివి
(నీవే)