దివిలో వేడుక - ఊరంతా పండుగ - నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా - ఆ నింగీ తారక - వెలిసే ఈ వింత చూపగా
మహా సంతోషమే - ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో - ఓహో ఉల్లాసమే
ఇల మెస్సయ్య - జన్మించినాడుగా
మన యేసయ్య - ఉదయించినాడుగా
మహారాజు - మన యేసు
నిన్నే కోరీ - ఇలా వచ్చెనే
జగాలేలే - మన యేసు
నిన్నే చేర - దిగి వచ్చెనే
దేవ దేవుడే - మరియ తనయుడై
ధరలో దీనుడై - పుట్టే పుణ్యుడై పరిశుద్ధాత్ముడే - పాపరహితుడై
ప్రేమపూర్ణుడే - పరమ జీవమై లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే
ఆడే గొల్లలు - పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు - వేడిరి యేసుని
మనకు రక్షణై - యేసు ఈ దినం
పాపాన్ని తొలగించ వచ్చాడుగా
నిను కరుణించి తన జాలి చూపాడుగా
కృపతో కాపాడ వచ్చెనే చెలిమై చల్లంగ చూసెనే