🔍
🎵
మోయలేని భారమంత · Sayaram Gattu
Home Songs Sayaram Gattu మోయలేని భారమంత
Sayaram Gattu Good Friday Songs bhaaramanthadooramantha

మోయలేని భారమంత

Moyaleni Bhaaramantha — Telugu & English Song Lyrics
Sayaram Gattu· Good Friday Songs· Feb 24, 2026 ·3 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మోయలేని భారమంత సిలువలో మోసావు
నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2)
అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
నాదు గతిని మార్చావు – (2)
Verse 1
కడలి పై నడిచిన పాదాలు
సిలువ బరువుకు తడబడి పోయే
స్వస్థతలు చూపిన హస్తములు
సిలువలో శీలలతో వ్రేళాడే (2)
ఇంత ఘోరము మోపిన నేరము
నేను చేసిన పాప భారము (2) || మోయలేని ||
Verse 2
జయము నీకని పలికిన జనము
మహిమ ఏదని నిను నిలదీసిరి
పాపములు క్షమియించిన నిన్ను
పాపివని పలుమారులు తెలిపిరి (2)
తాకినంతనే మహిమ నొసగిన
నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని ||
Verse 3
దైవ సుతుడవు అయినా గాని
దొంగలతో దోషిగా నిను చేర్చిరి
మధుర వాక్యము నేర్పిన నోటికి
చేదు చిరకతో దాహము తీర్చిరి (2)
ఇంత జరిగిన ఎంత కరుణ
వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని ||
Song Credits
Song Name
మోయలేని భారమంత
Artist
Sayaram Gattu
Category
Good Friday Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Sayaram Gattu
Get notified of new songs
🏆 Quick Quiz
"మోయలేని ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.