నన్ను దిద్దుము is a beautiful Telugu Christian worship song by Mungamoori Devadasu. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
నన్ను దిద్దుము Song Telugu Lyrics
Chorus
నన్ను దిద్దుము చిన్న ప్రాయము – సన్నుతుండగు నాయనా
నీవు కన్న తండ్రి వనుచు నేను – నిన్ను చేరితి నాయనా ||నన్ను||
Verse 1
దూరమునకు బోయి నీ దరి – జేర నైతిని నాయనా
నేను కారు మూర్ఖపు పిల్లనై కా – రడవి దిరిగితి నాయనా ||నన్ను||
Verse 2
మంచి మార్గము లేదు నాలో – మరణ పాత్రుండ నాయనా
నేను వంచితుండ నైతిని ప్ర-పంచమందున నాయనా ||నన్ను||
Verse 3
చాల మారులు తప్పిపోతిని – మేలు గానక నాయనా
నా చాల మొరల నాలకించుము – జాలిగల నా నాయనా ||నన్ను||
Verse 4
జ్ఞాన మంతయు బాడుచేసి- కాన నైతిని నాయనా
నీవు జ్ఞానము గల తండ్రి మంచు – జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||
Verse 5
కొద్ది నరుడను దిద్ది నను నీ – యొద్ద జేర్చుము నాయనా
నీ యొద్ద జేర్చి బుద్ధి చెప్పుము – మొద్దు నైతిని నాయనా ||నన్ను||
Verse 6
ఎక్కడను నీవంటి మార్గము – నెరుగ నైతిని నాయనా
నీ రెక్క చాటున నన్ను జేర్చి – చక్కపరచుము నాయనా ||నన్ను||
Verse 7
శత్రువగు సాతాను నన్ను – మిత్రు జేయను నాయనా
యెన్నో సూత్రములు గల్పించెను నా – నేత్రముల కో నాయనా ||నన్ను||
Verse 8
వాసిగా నే బాప లోకపు – వాసుడ నో నాయనా
నీ దాసులలో నొకనిగా నను జెసి కావుము నాయనా ||నన్ను||
Vaasigaa Ne Baapa Lokapu – Vaasuda No Naayanaa
Nee Daasulalo Nokanigaa Nanu Jesi Kaavumu Naayanaa ||Nannu||
Watch నన్ను దిద్దుము Song Lyrics Online
▶
Watch Official Video
నన్ను దిద్దుము Song Telugu and English Lyrics
About this Song
నన్ను దిద్దుము is a heartfelt Telugu Christian worship song performed by Mungamoori Devadasu. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete నన్ను దిద్దుము lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
నన్ను దిద్దుము
Artist
Mungamoori Devadasu
Category
Repentance Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
19
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏