Chorus
నా చెలిమి కోరి – నీ కలిమి వీడి
నా చెంత చేరావు శ్రీమంతుడా
నా రక్షణ కొరకై – ఆ శిక్షను పొంది
బలియాగమైన నిజ స్నేహితుడా ||నా చెలిమి||
Verse 1
ద్రోహినై దూరమైతిని – పాపినై పరుగులెడితిని
గమ్యమే ఎరుగనైతిని – మరణమే శరణమాయెను
ఎంతో ప్రేమించితివి – నా స్థానమందు నిలిచితివి
కృపతో నన్ రక్షించితివి – నా దోషశిక్ష భరించితివి ||నా చెలిమి||
Verse 2
నిందలు అవమానములు – హేళనలు చీత్కారములు
కఠిన దెబ్బలు ముళ్లపోటులు – సిలువ భారం కాయమంతా గాయం
హృదినే బాధించినా – భరియించావు వేదన మౌనముగా
తనువే తల్లడిల్లినా – తృప్తినొందావు నను తలచుకొని ||నా చెలిమి||
Verse 3
ఏ రీతి నిన్ను – కీర్తించగలను
నా నీతి నీవే ఓ యేసుదేవా
నీ సాక్షిగ నిలిచి – నీ ప్రేమను చాటి
ఘనపరతును నిన్నే ప్రియ స్నేహితుడా
Chorus
Naa Chelimi Kori – Nee Kalimi Veedi
Naa Chentha Cheraavu Sreemanthudaa
Naa Rakshana Korakai – Aa Shikshanu Pondi
Baliyaagamaina Nija Snehithudaa ||Naa Chelimi||
Verse 1
Drohinai Dooramaithini – Paapinai Paruguledithini
Gamyame Eruganaithini – Maraname Sharanamaayenu
Entho Preminchithivi – Naa Sthaanamandu Nilichithivi
Krupatho Nan Rakshinchithivi – Naa Dosha Shiksha Bharinchithivi ||Naa Chelimi||
Verse 2
Nindalu Avamaanamulu – Helanalu Cheethkaaramulu
Katina Debbalu Mulla Potulu – Siluva Bhaaram Kaayamanthaa Gaayam
Hrudine Baadhinchinaa – Bhariyinchaavu Vedana Mounamugaa
Thanuve Thalladillinaa – Thrupthinondaavu Nanu Thalachukoni ||Naa Chelimi||
Verse 3
Ae Reethi Ninnu – Keerthinchagalanu
Naa Neethi Neeve O Yesudevaa
Nee Saakshiga Nilichi – Nee Premanu Chaati
Ghanaparathunu Ninne Priya Snehithudaa