🔍
🎵
ఓ యాత్రికుడా · Victor Rampogu
Home Songs Victor Rampogu ఓ యాత్రికుడా
Victor Rampogu Gospel Songs aadeshamdaiva-nirnayam

ఓ యాత్రికుడా

O Yaathrikudaa — Telugu & English Song Lyrics
Victor Rampogu· Gospel Songs· Feb 24, 2026 ·6 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా
బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా..
ఓ బాటసారి ఓహో బాటసారి
జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా
గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది
నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2)
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||
Verse 1
పుట్టగానే తొట్టెలో వేస్తారు
గిట్టగానే పెట్టెలో మూస్తారు
జాగు చేయక కాటికి మోస్తారు
ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. (2)
బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే (2)
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||
Verse 2
ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు
ఏడిపిస్తూ సమాధికి పోతావు
కూడబెట్టినవి మోసుకు పోలేవు
ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. (2)
జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే (2)
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||
Verse 3
మరణము ఒక నిద్ర యేసునందు
అంతము అది కాదు క్రీస్తునందు
మృతులు లేచుట స్థిరము యేసునందు
నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. (2)
నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము (2)
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||
Song Credits
Song Name
ఓ యాత్రికుడా
Artist
Victor Rampogu
Category
Gospel Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
6
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Victor Rampogu
Get notified of new songs
🏆 Quick Quiz
"ఓ యాత్రికుడా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.