🔍
🎵
హృదయమనెడు తలుపు నొద్ద · Pulipaaka Jagannaathamu
Home Songs Pulipaaka Jagannaathamu హృదయమనెడు తలుపు నొద్ద
Pulipaaka Jagannaathamu Gospel Songs hrudayamanedumimmulanu

హృదయమనెడు తలుపు నొద్ద

Hrudayamanedu Thalupu Nodda — Telugu & English Song Lyrics
Pulipaaka Jagannaathamu· Gospel Songs· Feb 24, 2026 ·3 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2) ||హృదయ||
Verse 1
పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2) ||హృదయ||
Verse 2
కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2) ||హృదయ||
Verse 3
ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2) ||హృదయ||
Verse 4
అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2) ||హృదయ||
Verse 5
జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2) ||హృదయ||
Verse 6
సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2) ||హృదయ||
Verse 7
చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2) ||హృదయ||
Verse 8
అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2) ||హృదయ||
Verse 9
బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2) ||హృదయ||
Song Credits
Song Name
హృదయమనెడు తలుపు నొద్ద
Artist
Pulipaaka Jagannaathamu
Category
Gospel Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
3
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Pulipaaka Jagannaathamu
Get notified of new songs
🏆 Quick Quiz
"హృదయమనెడు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.