🔍
🎵
రండి సువార్త సునాదముతో ·
Home Songs రండి సువార్త సునాదముతో
Gospel Songs dayaanidhinaadamutho

రండి సువార్త సునాదముతో

Randi Suvaartha Sunaadamutho — Telugu & English Song Lyrics
Gospel Songs· Jul 13, 2026 ·1 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
రండి సువార్త సునాదముతో
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2) ||రండి||
Verse 1
యేసే మానవ జాతి వికాసం
యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం
భాసుర క్రైస్తవ శుభ నామం ||రండి||
Verse 2
యేసే దేవుని ప్రేమ స్వరూపం
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం
ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి||
Verse 3
యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం
దాసుల ప్రార్ధన సహకారం ||రండి||
Verse 4
యేసే సంఘములో మన కాంతి
యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి
పసిపాపల దీవెన మూర్తి ||రండి||
Verse 5
యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం
వాసిగ నమ్మిన జన స్తోత్రం ||రండి||
Song Credits
Song Name
రండి సువార్త సునాదముతో
Category
Gospel Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
1
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"రండి ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.