Chorus
ఆధారమా నా యేసయ్య
ఆలించుమా నా ప్రార్ధన
మదిలోని ప్రతి భారం - మనసార పాడే మౌన గీతం
నీకే ఆలాపన - ప్రియమైన ఆరాధన
Verse 1
ఏది గెలుపు - ఏది మలుపు
తలచి చూడ - నిదుర రాదే
Verse 2
ఓటమైన - ఒంటరైన
కరుణ చూపి - నడిపినావు
Verse 3
వ్యధలలోన - విసిగిపోయి - పాదములనే చేరగా
స్థితిని చూచి - స్తుతిగ మార్చి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా
Verse 4
నీదు వదనం - కాంతి కిరణం
కనులలోని - ప్రేమ మధురం
Verse 5
ఎదురు చూసే - జీవ గమనం
బదులు పంపే - సిలువ రుధిరం
Verse 6
కడలిలోన - కరముచాపి - ఆదరించే దైవమా
దీనురాలి - దరికిచేరి - దీవెనలతో నింపవా
దీవెనలతో నింపవా