గమ్యం చేరాలని is a beautiful Telugu Christian worship song by John Wesley. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
గమ్యం చేరాలని Song Telugu Lyrics
Chorus
గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనా
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని||
Verse 1
భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||
Verse 2
అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండినా
నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||
గమ్యం చేరాలని is a heartfelt Telugu Christian worship song performed by John Wesley. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete గమ్యం చేరాలని lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
గమ్యం చేరాలని
Artist
John Wesley
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
18
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏