🔍
🎵
క్రీస్తే సర్వాధికారి · Ravuri Rathnamu
Home Songs Ravuri Rathnamu క్రీస్తే సర్వాధికారి
Ravuri Rathnamu Praise Songs kreesthemahopakaari

క్రీస్తే సర్వాధికారి

Kreesthe Sarvaadhikaari — Telugu & English Song Lyrics
Ravuri Rathnamu· Praise Songs· Feb 24, 2026 ·2 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
క్రీస్తే సర్వాధికారి – క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి – క్రీస్తే ఆ సిల్వధారి ||క్రీస్తే||
Verse 1
ముక్తి విధాత నేత – శక్తి నొసంగు దాత
భక్తి విలాప శ్రోత – పరమంబు వీడె గాన ||క్రీస్తే||
Verse 2
దివ్య పథంబురోసి – దైవంబు తోడు బాసి
దాసుని రూపు దాల్చి – ధరణి కేతెంచె గాన ||క్రీస్తే||
Verse 3
శాశ్వత లోకవాసి – సత్యామృతంపు రాశి
శాప భారంబు మోసి – శ్రమల సహించె గాన ||క్రీస్తే||
Verse 4
సైతాను జనము గూల్పన్ – పాతాళమునకు బంపన్
నీతి పథంబు బెంప – రుధిరంబు గార్చె గాన ||క్రీస్తే||
Verse 5
మృత్యువు ముళ్ళు తృపన్ – నిత్య జీవంబు బెంపన్
మర్త్యాళి భయము దీర్పన్ – మరణంబు గెలిచె గాన ||క్రీస్తే||
Verse 6
పరమందు దివిజులైన – ధరయందు మనుజులైన
ప్రతి నాలుక మోకాలు – ప్రభునే భజించు గాన ||క్రీస్తే||
Verse 7
ఈ నామమునకు మించు – నామంబు లేదటంచు
యెహోవా తండ్రి యేసున్ – హెచ్చించినాడు గాన ||క్రీస్తే||
Song Credits
Song Name
క్రీస్తే సర్వాధికారి
Artist
Ravuri Rathnamu
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Ravuri Rathnamu
Get notified of new songs
🏆 Quick Quiz
"క్రీస్తే ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.