🔍
🎵
Mahadanandamaina Needhu Sannidhi Song Lyrics | Pranam Kamlakar | Hosanna Ministries Song · Hosanna Ministries
Home Songs Hosanna Ministries Mahadanandamaina Needhu Sannidhi Song Lyrics | Pra...
Hosanna Ministries Hosanna Ministries Mahadanandamaina Needhu Sannidhi Song LyricsHosanna Ministries song

Mahadanandamaina Needhu Sannidhi Song Lyrics | Pranam Kamlakar | Hosanna Ministries Song

Hosanna Ministries· Hosanna Ministries· Oct 13, 2024 ·2 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మహాదానందమైన నీదు సన్నిధి
ఆపత్కాలమందు దాగుచోటది
మనవులు అన్నియు ఆలకించిన
వినయముగలవారికి ఘనతనిచ్చిన
నీ సింహాసనమును స్థాపించుటకు
నీవు కోరుకున్న సన్నిధానము ||2||
ఎంత మధురము నీ ప్రేమమందిరం
పరవశమే నాకు యేసయ్య||2|| ||మహాదానందమైన||
Verse 1
విసిగిన హృదయం కలవరమొంది
వినయము కలిగి నిన్ను చేరగ ||2||
పరమందుండి నీవు కరుణచూపగ
లేత చిగురుపైన మంచు కురియు రీతిగా ||2||
ప్రేమను చూపి - బాహువు చాపి
నీలో నన్ను లీనము చేసిన ||2||
ప్రేమసాగర జీవితాంతము
నీ సన్నిధిని కాచుకొందును ||2|| ||మహాదానందమైన||
Verse 2
లెక్కించలేని స్తుతులతో నీవు శాశ్వత కాలము స్తుతినొందెదవు ||2||
మహిమతో నీవు సంచరించగా
ఏడుదీపస్తంభములకు వెలుగు కలుగగా ||2||
ఉన్నతమైన ప్రత్యక్షతను
నే చూచుటకు కృపనిచ్చితివి ||2||
కృపసాగర వధువు సంఘమై
నీ కోసమే వేచియుందును||2|| ||మహాదానందమైన||
Verse 3
సియోను శిఖరమే నీ సింహాసనం శుద్ధులు నివసించు మహిమనగరము ||2||
ఎవరు పాడలేని కొత్త కీర్తన
మధురముగా నీయెదుట నేను పాదెద ||2||
సౌందర్యముగా అలంకరించిన
నగరములోనే నివసించెదను ||2||
ప్రేమ పూర్ణుడా మహిమాన్వితుడా
నీతోనే రాజ్యమేలదా||2|| ||మహాదానందమైన||
Song Credits
Song Name
Mahadanandamaina Needhu Sannidhi Song Lyrics | Pranam Kamlakar | Hosanna Ministries Song
Artist
Hosanna Ministries
Category
Hosanna Ministries
Language
Telugu
Published
Oct 13, 2024
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Hosanna Ministries
Get notified of new songs
🏆 Quick Quiz
"మహాదానందమైన ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.