🔍
🎵
మేలుకో మహిమ రాజు ·
Home Songs మేలుకో మహిమ రాజు
Second Coming Songs booradhwanitho

మేలుకో మహిమ రాజు

Meluko Mahima Raaju — Telugu & English Song Lyrics
Second Coming Songs· Feb 24, 2026 ·6 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
మేలుకో! మహిమ రాజు
వేగమే రానై యున్నాడు (2)
Verse 1
పరమునుండి – బూర ధ్వనితో
అరయు నేసు – ఆర్భాటముతో (2)
సర్వలోకము – తేరిచూచును
త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో||
Verse 2
గురుతులెల్ల – ధరణియందు
సరిగ చూడ – జరుగుచుండ (2)
చిరునవ్వుతో – చేరి ప్రభుని
త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో||
Verse 3
క్రీస్తునందు – మృతులెల్లరు
కడబూర – మ్రోగగానే (2)
క్రీస్తువలె – తిరిగి లేతురు
లేతువా? నీవు ప్రియుడా (2) ||మేలుకో||
Verse 4
అరయంగ – పరిశుద్ధులు
మురిసెదరు – అక్షయ దేహులై (2)
పరమందు – ప్రభుక్రీస్తు
నిరతము – ఓ ప్రియుండా (2) ||మేలుకో||
Verse 5
కరుణలేని – ఓ మరణమా
నిరతము నీకు జయమగునా (2)
మరణ సంహా – రుండేసు
త్వరగా – రానై యున్నాడు (2) ||మేలుకో||
Verse 6
మాంసలోక – పిశాచాదులు
హింస పరచ – విజృంభించిన (2)
లేశమైనను – జడియకుము
ఆశతో – కాచుకొనుము (2) ||మేలుకో||
Verse 7
పాపమును – చేయకుమా
రేపకుమా – దైవ కోపమును (2)
శాపమును – తప్పుకొని
శ్రద్ధతో – కాచుకొనుమా (2) ||మేలుకో||
Song Credits
Song Name
మేలుకో మహిమ రాజు
Category
Second Coming Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
6
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"మేలుకో! ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.