🔍
🎵
త్రాహిమాం క్రీస్తు నాథ · Purushotthamu Chaudhary
Home Songs Purushotthamu Chaudhary త్రాహిమాం క్రీస్తు నాథ
Purushotthamu Chaudhary Prayer Songs choodadaya

త్రాహిమాం క్రీస్తు నాథ

Thraahimaam Kreesthu Naatha — Telugu & English Song Lyrics
Purushotthamu Chaudhary· Prayer Songs· Feb 24, 2026 ·4 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే
నేను – దేహి యనుచు నీ పాదములే
దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం||
Verse 1
గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై
రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి
త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి
యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం||
Verse 2
నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని
చేయరాని దుష్కర్మములు – చేసినాడను
దయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనుల
జేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం||
Verse 3
నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేక
దబ్బర లాడుతకు ము – త్తా నైతిని
అబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందు
దబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం||
Verse 4
నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు
చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా
విన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చి
యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||
Song Credits
Song Name
త్రాహిమాం క్రీస్తు నాథ
Artist
Purushotthamu Chaudhary
Category
Prayer Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Purushotthamu Chaudhary
Get notified of new songs
🏆 Quick Quiz
"త్రాహిమాం ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.