ఉన్నత స్థలములలో is a beautiful Telugu Christian worship song. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఉన్నత స్థలములలో Song Telugu Lyrics
Chorus
ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివి
నా శ్రమ దినములలో – కృపలతో కాచితివి (2)
స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడా
మహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా (2)
Verse 1
ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టి
తల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి (2)
నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపిన
లేని అర్హతలను నాకు వరముగా చేసిన (2) దేవా ||ఉన్నత||
Verse 2
కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండా
నీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా (2)
శుద్ధ ఆత్మనిచ్చి నాకు మార్గములు చూపిన
హీనమైన నన్ను నీలో దృఢముగా మార్చిన (2) దేవా ||ఉన్నత||
Verse 3
గాఢాంధకారపు లోయలో నేను కొనసాగినా
పదివేల జనములు నా కుడి ప్రక్కనే కూలినా (2)
నేను భయపడనుగా నీవే ఉంటె ఆశ్రయముగా
ఏ తెగులు రాదుగా నాదు గృహమును చేరగా (2) దేవా ||ఉన్నత||
ఉన్నత స్థలములలో is a heartfelt Telugu Christian worship song. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఉన్నత స్థలములలో lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
ఉన్నత స్థలములలో
Category
Praise Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
14
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏