🔍
🎵
—
—
✕
Viduvani Bandhama Maruvani Snehama ·
Home› Songs› Viduvani Bandhama Maruvani Snehama
Trending Worship Song Latest Telugu Christian SongsTrending Christian Song Lyrics

Viduvani Bandhama Maruvani Snehama Lyrics

Viduvani Bandhama Maruvani Snehama
Trending Worship Song· Mar 16, 2024 ·723 views

Telugu Lyrics

విడువని బంధమా మరువని స్నేహమా
మమతానురాగాలే నీ మకరందమా!
చెదరని నీ చిరునవ్వే చెరిగిపోని జ్ఞాపకాలే
కృప కనికరములే నీ సౌందర్యమా!
విడువని బంధమా మరువని స్నేహమా
మమతానురాగాలే నీ మకరందమా!
చెదరని నీ చిరునవ్వే చెరిగిపోని జ్ఞాపకాలే
కృప కనికరములే నీ సౌందర్యమా!
మమతను పంచిన మహనీయుడా
మేలుచేయుటలో దయాళుడా
సమృద్ధి నిచ్చిన శ్రీమంతుడా
కృపచూపుటలో ఐశ్వర్యుడా
విడువని బంధమా మరువని స్నేహమా
మమతానురాగాలే నీ మకరందమా!
చెదరని నీ చిరునవ్వే చెరిగిపోని జ్ఞాపకాలే
కృప కనికరములే నీ సౌందర్యమా!
నాలోన నీవని నీతోనే పయనమని
నీవు లేకపోతే నేను లేనని
నీవే నా ప్రాణమని నీతోనే మరణమని
నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్ధమని
నాలోన నీవని నీతోనే పయనమని
నీవు లేకపోతే నేను లేనని
నీవే నా ప్రాణమని నీతోనే మరణమని
నీవు కాకపోతే నా బ్రతుకే వ్యర్ధమని
వాగ్దానం చేసినవారు నను విడచి వెళ్ళినారు
నిబంధన చేసి నాతో నను మరచి పోయినారు
నను ఎన్నడు విడువని మరువని బంధము నీవయ్య
నాతోడై నిలచి నడిచిన స్నేహము నీవయ్య
విడునవి బంధము నీవేనయ్య
మరువని స్నేహము నీవేనయ్య
చెదరని నవ్వే నీదేనయ్య
నా చెరగని జ్ఞాపకం నీవే యేసయ్య
కన్నీటి లోయలో కలతచెందె నా ప్రాణం
కరుణించువారులేక కృంగిపోయెనే
కష్టాల కౌగిలిలో కలవరపడె నా హృదయం
ఓదార్చువారి కోసం ఎదురు చూసెనె
కన్నీటి లోయలో కలతచెందె నా ప్రాణం
కరుణించువారులేక కృంగిపోయెనే
కష్టాల కౌగిలిలో కలవరపడె నా హృదయం
ఓదార్చువారి కోసం ఎదురు చూసెనె
నా దుఃఖ దినములలోన దరికెవ్వరు రానేరాక
నా ఒంటరి బ్రతుకులోన తోడెవ్వరు లేనేలేక
పగిలిన నా గుండెకు నీవు ఔషధమైనావు
నలిగిన నా మనస్సుకు నీవు నెమ్మదిఅయినావు
కలతలు బాపిన నా యేసయ్య
కన్నీరు తుడచిన నా దైవమా
మేలులతో నింపిన మహోన్నతుడా
మహిమలు చేయు మహాఘనుడా

English Transliteration

📝
English transliteration coming soon
We're working on adding romanized lyrics for this song.

Watch the Video

Viduvani Bandhama Maruvani Snehama video
▶
Watch Official Video

About the Song

Viduvani Bandhama Maruvani Snehama — a trending worship song, with lyrics in Telugu script and English transliteration above.

Frequently Asked Questions

What are the lyrics of Viduvani Bandhama Maruvani Snehama?
The full lyrics of Viduvani Bandhama Maruvani Snehama are on this page in Telugu script.
Is there a video of Viduvani Bandhama Maruvani Snehama?
Yes. The video is embedded on this page, so you can watch it while reading the lyrics.
Song Credits
Song Name
Viduvani Bandhama Maruvani Snehama
Category
Trending Worship Song
Language
Telugu
Published
Mar 16, 2024
Views
723
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"విడువని ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.