🔍
🎵
Deevinchave Samruddiga Song Lyrics | Bro.Suhaas Prince · Calvary Temple
Home Songs Calvary Temple Deevinchave Samruddiga Song Lyrics | Bro.Suhaas P...
Calvary Temple Calvary Temple Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

Deevinchave Samruddiga Song Lyrics | Bro.Suhaas Prince

Calvary Temple· Calvary Temple· Feb 25, 2024 ·28 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగమని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని
దారులలో ఏడారులలో
సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో
అగ్ని స్తంభమై నను నడుపుమయా
||దీవించావే సమృద్ధిగా||
1.
నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా
నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా
నా ఒంటరి పయనంలో నా జంటగ నిలిచావే
నే నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే (2)
ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో నిను పోలి నన్నిల సాగమని
||దీవించావే సమృద్ధిగా||
2.
కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా
కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా
నా కన్నీరంత తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా (2)
ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటములో నా పక్షముగానే నిలిచావే
||దీవించావే సమృద్ధిగా||
Song Credits
Song Name
Deevinchave Samruddiga Song Lyrics | Bro.Suhaas Prince
Artist
Calvary Temple
Category
Calvary Temple
Language
Telugu
Published
Feb 25, 2024
Views
28
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
Calvary Temple
Get notified of new songs
🏆 Quick Quiz
"దీవించావే ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.