Chorus
నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా…
॥పల్లవి॥
నిన్నే నమ్మినా - నీ సన్నిధి చేరినా
నన్ను కాదనకు నా రక్షకా
నిన్నే చేరినా – నీ సన్నిధి కోరినా
నన్ను త్రోసేయకు నా యేసయ్య
Verse 1
1. ఆరిపోతున్నా - మసిబారిపోతున్నా
జీవితాన్ని - (నా) వెలిగించుమయ్యా
పడిపోతున్నా - పాడైపోతున్నా
నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥
Verse 2
2. సోలిపోతున్నా - సొమ్మసిల్లిపోతున్నా
నా హృదయాన్ని - ఓదార్చుమయ్యా
కృంగిపోతున్నా - కుప్పకూలిపోతున్నా
నా బ్రతుకును - బాగుచేయుమయ్యా ॥నిన్నే॥