Chorus
లోకమంతట వెలుగు ప్రకాశించెను యేసు జన్మించినపుడు ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2) లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ॥లోకమంతట॥
Verse 1
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను చీకటి దాని గ్రహింప లేదు నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు వాడు చీకటిలో నడువక – (2) జీవపువెలుగై యుండుడనె యేసు ॥లోకమంతట॥
Verse 2
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైన నక్కరలేదు ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2) పిల్లయే దీపమై వెలుగుచుండు ॥లోకమంతట॥
Verse 3
విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక విూరు వెలుగు సంబంధులు విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే మరుగై యుండక నరులందరికి – (2) వెలుగై యుందురనె యేసుండు ॥లోకమంతట॥
Verse 4
చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి ధన్యులై లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద ప్రకాశించెను గొప్ప వెలుగు – (2) ప్రభువు యేసుకు జేయని పాడరే ॥లోకమంతట॥
Chorus
Lokamanthata Velugu Prakaashinchenu Yesu Janminchinapudu Aakaashamunandu Goppa Nakshathrambu Buttenapudu Loka Gnaanulu Gollalu Velli – (2) Loka Rakshakudesuku Mrokkiri ||Lokamanthata||
Verse 1
Nenu Velugai Cheekatilo Veluguchunnaanu Cheekati Daani Grahimpa Ledu Nenu lokamunaku Velugai Yunnaanu Nanu Vembadinchu Vaadu Cheekatilo Naduvaka – (2) Jeevapu Velugai Yundudane Yesu ||Lokamanthata||
Verse 2
Aa Pattanamulo Velugutaku Sooryudainanu Chandrudaina Nakkaraledu Aa Pattanamulo Devuni Mahimaye Prakaashinchuchunnadi Yepudu Aa Pattanamunaku Devuni Gorre – (2) Pillaye Deepamai Veluguchundu ||Lokamanthata||
Verse 3
Meeru Lokamunaku Velugai Yunnaaru Ganuka Meeru Velugu Sambandhulu Meeru Kondapaina Kattabadina Pattanambu Valene Marugai Yundaka Narulandariki – (2) Velugai Yundurane Yesundu ||Lokamanthata||
Verse 4
Cheekatilo Naduchu Janulu Goppa Velugunu Choochiri Dhanyulai Lokamanadu Maranachchaaya Gala Desha Nivaasula Meeda Prakaashinchenu Goppa Velugu – (2) Prabhuvu Yesuku Jeyani Paadare ||Lokamanthata||