🔍
🎵
పరమ దైవమే · A R Stevenson
Home Songs A R Stevenson పరమ దైవమే
A R Stevenson Christmas Songs jeevameparama

పరమ దైవమే

Parama Daivame — Telugu & English Song Lyrics
A R Stevenson· Christmas Songs· Feb 24, 2026 ·2 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
యేసు పుట్టుకలోని పరమార్ధాన్ని గ్రహించి
తిరిగి జన్మిస్తే
ఆయన కొరకు జీవించగలం
ఆయనను మనలో చూపించగలం
Verse 1
పరమ దైవమే మనుష్య రూపమై
ఉదయించెను నా కోసమే
అమర జీవమే నరుల కోసమై
దిగి వచ్చెను ఈ లోకమే
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయ
క్రీస్తు పుట్టెను – హల్లెలూయా (2) ||పరమ దైవమే||
Verse 2
ఆకార రహితుడు ఆత్మ స్వరూపుడు
శరీరమును ధరించెను
సర్వాధికారుడు బలాఢ్య ధీరుడు
దీనత్వమును వరించెను
వైభవమును విడిచెను – దాసునిగను మారెను – (2)
దీవెన భువికి తెచ్చెను – ముక్తి బాటగా… ||పరమ దైవమే||
Verse 3
అనాది వాక్యమే కృపా సమేతమై
ధరపై కాలు మోపెను
ఆ నీతి తేజమే నరావతారమై
శిశువై జననమాయెను
పాపి జతను కోరెను – రిక్తుడు తానాయెను (2)
భూలోకమును చేరెను – యేసు రాజుగా… ||పరమ దైవమే||
Verse 4
నిత్యుడు తండ్రియే విమోచనార్ధమై
కుమారుడై జనించెను
సత్య స్వరూపియే రక్షణ ధ్యేయమై
రాజ్యమునే భరించెను
మధ్య గోడ కూల్చను – సంధిని సమకూర్చను – (2)
సఖ్యత నిలుప వచ్చెను – శాంతి దూతగా… ||పరమ దైవమే||
Song Credits
Song Name
పరమ దైవమే
Artist
A R Stevenson
Category
Christmas Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🙏
A R Stevenson
Get notified of new songs
🏆 Quick Quiz
"యేసు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.