🔍
🎵
Yehova Naa Balama Song Lyrics | Telugu Christian Song ·
Home Songs Yehova Naa Balama Song Lyrics | Telugu Christian S...
Trending Worship Song Yehova Naa Balama Song LyricsYehova Naa Balama Song Telugu Lyrics

Yehova Naa Balama Song Lyrics | Telugu Christian Song

Trending Worship Song· May 17, 2025 ·4 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
యెహోవా – నా బలమా
యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం
Verse 1
చరణం 1
నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన
విడువక నను ఎడబాయనిదేవా.  || యెహోవా – నా బలమా ||
Verse 2
చరణం 2
దయగల వారిపై దయ చూపించును
కఠినుల యెడలను వికటము చూపును
గర్విష్టుల యొక్క గర్వము నణచును
సర్వమునెరిగిన సర్వాధికారి.  || యెహోవా – నా బలమా ||
Verse 3
చరణం 3
మరణపు టురులలో మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన ఆలయములో నా మొర వినెను
అదరెను ధరణి భయకంపముచే || యెహోవా – నా బలమా ||
Verse 4
చరణం 4
పౌరుషముగల ప్రభు కోపింపగ
పర్వతముల పునాదులు వణకెను
తన నోట నుండి వచ్చిన యగ్ని
దహించి వేసెను వైరులనెల్ల  || యెహోవా – నా బలమా ||
Verse 5
చరణం 5
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును
ఉరుములు మెరుపులు మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికిని || యెహోవా – నా బలమా ||
Verse 6
చరణం 6
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగగజేయును
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైన దేవుడు.  || యెహోవా – నా బలమా ||
Verse 7
చరణం 7
నా కాళ్ళను లేడి కాళ్లగ జేసి
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణ కేడెమును నాకందించి
అక్షయముగ తన పక్షము జేర్చిన.  || యెహోవా – నా బలమా ||
Verse 8
చరణం 8
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడవీవె
అన్యజనులలో ధన్యత జూపుచు
హల్లెలూయ స్తుతి గానము చేసెద. || యెహోవా – నా బలమా ||
Song Credits
Song Name
Yehova Naa Balama Song Lyrics | Telugu Christian Song
Category
Trending Worship Song
Language
Telugu
Published
May 17, 2025
Views
4
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"యెహోవా ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.