🔍
🎵
Yekaantha Sthalamu Korumu Song Lyrics | Smruthi | Jeeva R. Pakerla ·
Home Songs Yekaantha Sthalamu Korumu Song Lyrics | Smruthi |...
Trending Worship Song Telugu Christian Song LyricsLatest Telugu Christian Songs

Yekaantha Sthalamu Korumu Song Lyrics | Smruthi | Jeeva R. Pakerla

Trending Worship Song· Jan 9, 2025 ·2 views
Watch Official Video
Advertisement
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
ఏకాంతస్థలము కోరుము – దేవుని ప్రార్ధింప –
ఏకాంత స్థలము చేరుము ఏకాంత స్థలము చేరి –
మోకాళ్ళ మీదవుండి లోకాశలను మదికి రాకుండ చూచుకొనుము
|| ఏకాంత ||
Verse 1
ఊహలోని పాపములను – ఒప్పుకొనుము తండ్రియెదుట = దేహము లోపలకవియె – దిగుచు నిన్ను బాధ పెట్టును
|| ఏకాంత ||
Verse 2
మాటలందలి పాపములను – మన్నించుమని వేడుకొనుము = ఆట పాటలందుమాట – లాడుటయు నేరంబులగును
|| ఏకాంత ||
Verse 3
పాప క్రియలు అతి దుఃఖముముతో -ప్రభుని యెదుట ఒప్పుకొనుము = పాపము మరల చేయనట్టి – ప్రయత్నంబుల్ చేయవలెను
|| ఏకాంత ||
Verse 4
నిన్ను మరల సిలువవేసి – యున్న పాప జీవినయ్యో = నన్ను క్షమియించుమని – యన్న నరులు మారువారు
|| ఏకాంత ||
Verse 5
చెడుగుమాని మంచిపనులు – చేయకున్న పాపమగును = పడియు లేవకున్న గొప్ప – పాపమగును పాపమగును
|| ఏకాంత ||
Verse 6
దేవా!నాకు కనబడుమన్న – దేవదర్శనమగును నీకు = పావనం బగు రూపముచూచి – బహుగా సంతోషించగలవు
|| ఏకాంత ||
Verse 7
దేవా!మాటలాడుమన్న – దేవవాక్కు వినబడు నీకు – నీవు అడిగిన ప్రశ్నలకెల్ల – నిజము తెలియనగును నీకు
|| ఏకాంత ||
Verse 8
ఎప్పుడు చెడుగు నీలోనికి - ఎగిరి వచ్చునో అప్పుడే - అప్పుడే నరక మార్గమందు - అడుగు బెట్టిన వాడవగుదువు
|| ఏకాంత ||
Verse 9
కష్టాల మేఘముల వెనుక - కలడు నీతి సూర్యుడు క్రీస్తు - దృష్టించు చున్నాడు నిన్ను - దిగులుపడకు దిగులుపడకు
|| ఏకాంత ||
Verse 10
నరలోక పాపాలు చూడు - నరకమునకు నిను దిగలాగు - పరలోకము వైపు చూడు - పైకి నిన్ను ఎత్తుచుండు
|| ఏకాంత ||
Song Credits
Song Name
Yekaantha Sthalamu Korumu Song Lyrics | Smruthi | Jeeva R. Pakerla
Category
Trending Worship Song
Language
Telugu
Published
Jan 9, 2025
Views
2
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"ఏకాంతస్థలము ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.