Chorus
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండీ
యేసయ్య మనదేవుడు
నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించ వచ్చాడు
పరమాత్ముడు
Verse 1
1. లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా (2)
దూతాళి పాడి - కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా - దరువేసే చూడు మెస్సయ్య - పుట్టాడనీ
మన మెస్సయ్య - పుట్టాడనీ
Verse 2
2. వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ
ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా (2)
మనసున్న వాడు - దయ చూపువాడు అలనాటి అనుబంధమే
కనులారా చూడు - మనసారా వేడు దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే
Verse 3
3. ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా (2)
సలిగాలి రాత్రి - పిలిసింది సూడు మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా
Chorus
Yelo Yelo Yelo Antu Vachharandi Gollalu
Santhoshaale Pongenandi - Hilessa
Daare Choope Devudochhe Ullasanga Ooru Aade
Sangeethaale Paadaalandi - Hilessa
Andhakaaraanni Tholaginche Mahaneeyudu Puttinaadandi
Yesayya Mana Devudu
Ninne Kori Ninne Cheri Itta Rakshincha Vachhadu
Paramaathmudu
Verse 1
1. Lokaalaneleti Raaraajura - Udayinche Sooreedai Vachhadura
Aakasa Veedhi - Meriseti Daari - Oka Thaara Murisindhigaa (2)
Dhoothaali Paadi - Kolichaaru Choodu Ghanamaina Oka Veduka
Aa Gollalega - Daruvese Choodu Messiah - Puttaadanee
Mana Messiah - Puttadanee
Verse 2
2. Vennello Poosindhi O Sandhadi - Palikindhi Oorantha Ee Sangathi
Ee Deenudanta - Pasi Baaludanta - Velisaadu Maharaajugaa (2)
Manasunnavaadu - Dayachoopuvaadu Alanaati Anubandhame
Kanulaara Choodu - Manasaara Vedu Digivachhe Manakosame
Ila Digivachhe Manakosame
Verse 3
3. Aa Ningi Thaaralla Velagaaliraa - Jagamantha Choosela Brathakaaliraa
Veliginchuvaadu - Manalonivaadu - Nilichaadu Mana Thodugaa (2)
Saligaali Rathri - Pilisindhi Soodu Manalona Oka Pandaga
Bhayamela Neeku - Digulela Neeku Yesayya Manakundagaa
Mana Yesayya Manakundaga
Verse 4
https://www.youtube.com/watch?v=vPpBTNnIIGs
Verse 5
In the joyful celebration of Christmas, "Yelo Yelo" captures the folk spirit and excitement of the shepherds who first heard the good news. This Telugu Christmas song from the Sambaralu 5 series beautifully combines traditional folk melodies with a powerful message of hope. Sung by Joshua Shaik and Javed Ali, with music by Pranam Kamlakhar, this song invites us to dance and sing with joy as we celebrate the birth of our Savior Jesus Christ.