ఉన్నపాటున వచ్చుచున్నాను is a beautiful Telugu Christian worship song by Purushothamu Chowdary. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఉన్నపాటున వచ్చుచున్నాను Song Telugu Lyrics
Chorus
ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి
యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను ||ఉన్న||
Verse 1
కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని
ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||
Verse 2
మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై
అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను
అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని ||ఉన్న||
Verse 3
వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను
పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే
నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె ||ఉన్న||
Verse 4
కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము
బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె ||ఉన్న||
Verse 5
నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని
కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని
భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె ||ఉన్న||
Verse 6
దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను
తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు
డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే ||ఉన్న||
Kaarunya Nidhi Yesu – Naa Rakshakaa Nee Sha-reera Rakthamu Chinduta
Bhoori Dayatho Nannu Nee Dari – Jera Rammani Piluchutayu Ni
Shkaaranapu Nee Prema Yidi Mari – Vere Hethuvu Ledu Naa Yeda ||Unna||
Darileni Yaananda-karamaina Nee Prema – Tharame Varnana Cheyanu
Theravu Kadda Baina Yanniti – Viruga Gottenu Gaana Ne Nipu
Darudugaa Nee Vaada Navutaku – Mari Nijamu Nee Vaada Navutake ||Unna||
Watch ఉన్నపాటున వచ్చుచున్నాను Song Lyrics Online
▶
Watch Official Video
ఉన్నపాటున వచ్చుచున్నాను Song Telugu and English Lyrics
About this Song
ఉన్నపాటున వచ్చుచున్నాను is a heartfelt Telugu Christian worship song performed by Purushothamu Chowdary. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఉన్నపాటున వచ్చుచున్నాను lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
ఉన్నపాటున వచ్చుచున్నాను
Artist
Purushothamu Chowdary
Category
Worship Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
10
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏