🔍
🎵
అంతా నా మేలుకే ·
Home Songs అంతా నా మేలుకే
Worship Songs aaraadhanaanthaa

అంతా నా మేలుకే

Anthaa Naa Meluke — Telugu & English Song Lyrics
Worship Songs· Jul 13, 2026 ·6 views
Watch Official Video
Song Lyrics
తెలుగు
English
Meaning
Chorus
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
Verse 1
అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
Verse 2
కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
Verse 3
ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా (2)
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక (2) ||అంతా||
Verse 4
అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2)
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
Verse 5
ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును (2)
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా (2)
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
Verse 6
చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా (2)
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు (2)
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
Verse 7
సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము – నేను పొందాలని (2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై (2) ||అంతా||
Verse 8
నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే (2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే (2) ||అంతా||
Song Credits
Song Name
అంతా నా మేలుకే
Category
Worship Songs
Language
Telugu
Published
Jul 13, 2026
Views
6
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏
Advertisement
🏆 Quick Quiz
"నేనెల్లప్పుడు ___"
🙏 Prayer Chain · 47 praying
S
Sunitha R.
Hyderabad
This song brought me peace during my illness. Praying for everyone going through trials.
R
Ravi K.
Vijayawada
Please pray for my family. This verse speaks to my heart every morning.