ఎంతెంత భారమాయె is a beautiful Telugu Christian worship song by Sayaram Gattu. Find the complete song lyrics in Telugu and English transliteration below, along with the official video.
ఎంతెంత భారమాయె Song Telugu Lyrics
Chorus
ఎంతెంత భారమాయె ఆ సిలువ
లోక పాపములన్ని నువ్వు గెలువ (2)
కదిలినావు ఆ కల్వరికి
మరణముని దరి చేర్చుకొని (2)
యేసయ్యా… నా యేసయ్యా…
అలసిపోతివ నా యేసయ్యా… (2)
Verse 1
కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను
పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2)
వడి ముళ్ళు తలలోన నాటేను
నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2) ||యేసయ్యా||
Verse 2
బరువైన సిలువను మోయలేక
తడబడె నీ అడుగు అదిరిపడి (2)
వడివడిగా నిన్ను నడువుమని
పడి పడి తన్నిరి ఆ పాపులు (2) ||యేసయ్యా||
Verse 3
చల్లని నీ దేహమల్లాడెను
ఏ చోటు లేకుండ గాయాలతో (2)
కాళ్ళు చేతులకు దిగి మేకులు
వ్రేళాడే సిలువకు నీ ప్రాణము (2) ||యేసయ్యా||
Verse 4
వెలలేనిది తండ్రి నీ త్యాగము
నీ కష్టమంతయు నా పాపము (2)
మదిలోన కొలువుండు నా రక్షకా
వదిలేది లేదు నిన్ను నా పాలిక (2) ||యేసయ్యా||
ఎంతెంత భారమాయె Song English Lyrics
Chorus
Enthentha Bhaaramaaye Aa Siluva
Loka Paapamulanni Nuvvu Geluva (2)
Kadilinaavu Aa Kalvariki
Maranamuni Dari Cherchukoni (2)
Yesayyaa… Naa Yesayyaa…
Alasipothiva Naa Yesayyaa… (2)
ఎంతెంత భారమాయె is a heartfelt Telugu Christian worship song performed by Sayaram Gattu. The lyrics express deep devotion, faith, and praise to God. This song is widely sung in Telugu churches and prayer meetings across Andhra Pradesh and Telangana. PeaceTheories provides the complete ఎంతెంత భారమాయె lyrics in both Telugu script and English transliteration for worshippers worldwide.
Share this song
Song Credits
Song Name
ఎంతెంత భారమాయె
Artist
Sayaram Gattu
Category
Worship Songs
Language
Telugu
Published
Feb 24, 2026
Views
12
✝️
AI Song Companion
Ask about this song
Ask me about the meaning, Bible references, or how to apply this song in your life. 🙏